సొమ్ము కేంద్ర ప్రభుత్వానిది.. సోకు రాష్ట్ర ప్రభుత్వానిది!: జగన్‌కు రఘురామ లేఖ
- ఉపాధి హామీ పథక బకాయిలు తక్షణమే విడుదల చేయాలి
- కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు
- కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు విడుదలవుతున్నాయి
- రాష్ట్ర సర్కారు బకాయిలు విడుదల చేయకపోవడం సరికాదు
ముఖ్యమంత్రి జగన్ కు ఎంపీ రఘురామకృష్ణ రాజు 'నవ సూచనలు(వినమ్రతతో)' పేరుతో నిన్నటి నుంచి లేఖలు రాయడం ప్రారంభించిన విషయం తెలిసిందే. నవ సూచనలు మొదటి లేఖ పేరుతో నిన్న ఆయన.. రాష్ట్రంలో 2023 నాటికి ప్రతి పేద కుటుంబానికి సొంత ఇంటిని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో నిర్మిస్తున్న ఇళ్ల నాణ్యత, లోపాలను గుర్తు చేశారు. ఈ రోజు నవ సూచనలు రెండవ లేఖ పేరుతో ఉపాధి హామీ పథకం గురించి జగన్ కు లేఖ రాశారు.
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంఎన్ఈఆర్జీఏ) కింద కార్మికులకు చెల్లించాల్సిన బకాయిలు తక్షణమే విడుదల చేయాలని కోరారు. బకాయిలు విడుదల కాకపోతుండడంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు విడుదలవుతున్నప్పటికీ బకాయిలు విడుదల చేయకపోవడం సరికాదన్నారు. దీంతో సొమ్ము కేంద్ర ప్రభుత్వానిది.. సోకు రాష్ట్ర ప్రభుత్వానిది అని ప్రజలు అభిప్రాయపడుతున్నారని ఆయన పేర్కొన్నారు.