భారతి రెడ్డి గారిని ఏపీ ముఖ్యమంత్రి చేయాలనే ఆలోచన బహిర్గతం చేశారా?: గోరంట్ల బుచ్చయ్య
- లోపల మాట్లాడుకునే మాటలు బయటికొచ్చాయి
- మీ వాళ్లని మానసికంగా సంసిద్ధుల్ని చేసేందుకే ఇలా అన్నారా?
- జైలుకి వెళ్లడానికి సిద్ధం అయ్యారు అని అంతఃపురం టాక్
గొల్లపూడిలో జరిగిన దిశ యాప్ ప్రచార కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ నిన్న మాట్లాడుతూ తడబడ్డారని టీడీపీ నేత బుచ్చయ్య చౌదరి గుర్తు చేశారు. ‘ఏపీ సీఎం ఓ మహిళ’ అని ఆయన చేసిన వ్యాఖ్యలపై గోరంట్ల బుచ్చయ్య చౌదరి సెటైర్లు వేశారు.
'ఏంటి సంగతి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు.. భారతి రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలనే ఆలోచన బహిర్గతం చేశారా...? లోపల మాట్లాడుకునే మాటలు మీ వాళ్లని మానసికంగా సంసిద్ధుల్ని చేసేందుకు ఇలా మాటలు వదిలినట్టు ఉన్నారు. జైలుకి వెళ్లడానికి సిద్ధం అయ్యారు అని అంతఃపురం టాక్...! అందుకే ఇలా కంఫ్యూషన్ లో మాటలు నిజాలుగా వచ్చేశాయి... అని అంటున్నారు' అని గోరంట్ల బుచ్చయ్య చౌదరి ట్వీట్ చేశారు.
కాగా, నిన్న దిశ యాప్ గురించి చెబుతూ జగన్ మాట్లాడుతూ.. ‘ఇంత ధైర్యంగా ఎందుకు చెప్పగలుగుతున్నా అంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి సాక్షాత్తు ఓ మహిళ కాబట్టి’ అని పొరపాటుగా వ్యాఖ్యానించారు. దీంతో హోంమంత్రి మేకతోటి సుచరిత కల్పించుకుంటూ.. ‘హోమ్ మినిస్టర్’ అని చెప్పారు. దీంతో జగన్ 'సారీ హోమ్ మినిస్టర్' అంటూ నవ్వారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.