తిరుమల స్వామివారి ఆర్జిత సేవల ఆన్ లైన్ టికెట్లు అందుబాటులోకి!

  • వెబ్ సైట్ ద్వారా టికెట్లు బుక్ చేసుకునే అవకాశం
  • కల్యాణోత్సవంకి బుక్ చేసుకుంటే ఏడాదిలో ఎప్పుడైనా దర్శనం
  • సేవలన్నీ ఎస్వీబీసీ చానెల్ లో ప్రత్యక్ష ప్రసారం
జులై నెలకు సంబంధించిన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆన్ లైన్ సేవా టికెట్లను టీటీడీ విడుదల చేసింది. ప్రత్యక్షంగా కాకుండా, టీవీల ద్వారా వర్చ్యువల్ గా వీటిలో పాల్గొనవచ్చు. కల్యాణోత్సవంతో పాటు ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ, ఊంజల్ సేవా టికెట్లను అధీకృత వెబ్ సైట్ ద్వారా భక్తులు బుక్ చేసుకోవచ్చని ప్రకటించింది. కల్యాణోత్సవం టికెట్లను పొందిన వారు ఏడాది వ్యవధిలో తమకు ఇష్టమైన రోజున దర్శనానికి వెళ్లవచ్చు. అన్ని సేవా కార్యక్రమాలనూ ఎస్వీబీసీ చానల్ లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.

కాగా, జులై నెలలో 16వ తేదీ కోటాను టీటీడీ విడుదల చేయలేదు. మిగతా అన్ని రోజులకూ అన్ని సేవల టికెట్లూ అందుబాటులో ఉన్నట్టు https://tirupatibalaji.ap.gov.in వెబ్ సైట్ చూపుతోంది. అయితే, కల్యాణం టికెట్లు బుక్ చేసుకున్న వారికి దర్శనం మాత్రం జూలై 19 తరువాత మాత్రమే అందుబాటులో ఉంటుంది.


More Telugu News