తెలుగు రాష్ట్రాల్లో నడిచే ఆరు ప్రత్యేక రైళ్లను రద్దు చేసిన దక్షిణమధ్య రైల్వే

  • ప్రయాణికులు లేక బోసిపోతుండడంతో నిర్ణయం
  • రేపటి నుంచి జులై 14, 15వ తేదీ వరకు రద్దు
  • రద్దయిన వాటిలో విశాఖ, కడప, కాచిగూడ నుంచి నడిచే రైళ్లు  
తెలుగు రాష్ట్రాల్లో నడిచే ఆరు ప్రత్యేక రైళ్లను దక్షిణమధ్య రైల్వే రెండు వారాలపాటు రద్దు చేసింది. ప్రయాణికుల నుంచి స్పందన లేక రైళ్లు బోసిపోతుండడంతో ఈ నిర్ణయం తీసుకుంది. రద్దు చేసిన రైళ్లలో విశాఖపట్టణం-కాచిగూడ, (08561) రైలును రేపటి నుంచి జులై 14వ తేదీ వరకు, కాచిగూడ-విశాఖపట్టణం (08562) రైలును జులై 2 నుంచి 15వ తేదీ వరకు, విశాఖపట్టణం-కడప (07488) రైలును రేపటి నుంచి 14వ తేదీ వరకు, కడప-విశాఖపట్టణం (07487) రైలును 2వ తేదీ నుంచి 15వ తేదీ వరకు, విశాఖపట్టణం-లింగంపల్లి (02831) రైలును రేపటి నుంచి 14వ తేదీ వరకు, లింగంపల్లి-విశాఖపట్టణం (02832) రైలును 2వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్టు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది.


More Telugu News