తమిళనాడు సీఎంతో సీనియర్ సినీ నటుడు అర్జున్ భేటీ
- మర్యాదపూర్వకంగానే కలిశానన్న అర్జున్
- జూలై 1, 2 తేదీల్లో ఆంజనేయ ఆలయంలో కుంభాభిషేకం
- హాజరు కావాలని స్టాలిన్ ను కోరిన అర్జున్
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ను సీనియర్ సినీ నటుడు అర్జున్ కలిశారు. తమ ఇంటికి వచ్చిన అర్జున్ కు స్టాలిన్ దంపతులు స్వాగతం పలికారు. తాను స్టాలిన్ ను మర్యాదపూర్వకంగానే కలిశానని ఈ సమావేశం అనంతరం అర్జున్ తెలిపారు. చెన్నైలోని కెరుగంబాక్కంలోని తన ఫామ్ హౌస్ లో ఆంజనేయుని ఆలయాన్ని నిర్మించిన అర్జున్, జులై 1, 2 తేదీల్లో కుంభాభిషేకాన్ని నిర్వహించాలని తలపెట్టారు.
ఈ కార్యక్రమానికి ఆహ్వానించేందుకే స్టాలిన్ ను కలిసినట్టుగా తెలుస్తోంది. స్టాలిన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత పలువురు ప్రముఖులు ఆయన్ను కలిసేందుకు ఆసక్తి చూపుతున్న సంగతి తెలిసిందే.
ఈ కార్యక్రమానికి ఆహ్వానించేందుకే స్టాలిన్ ను కలిసినట్టుగా తెలుస్తోంది. స్టాలిన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత పలువురు ప్రముఖులు ఆయన్ను కలిసేందుకు ఆసక్తి చూపుతున్న సంగతి తెలిసిందే.