రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు పర్యటనపై కీలక నిర్ణయం తీసుకున్న కేఆర్ఎంబీ!

  • ప్రాజెక్టు పరిశీలనకు వెళ్లాలనుకున్న కేఆర్ఎంబీ
  • రేపటి పర్యటన వాయిదా
  • ప్రభుత్వానికి సమాచారం ఇచ్చాక పర్యటించాలని నిర్ణయం
  • కేంద్ర బలగాల సాయం తీసుకోవాలని యోచన
రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు పర్యటనపై కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం జరగాల్సిన ఎత్తిపోతల పథకం పర్యటనను చివరి నిమిషంలో వాయిదా వేసుకుంది. ఈ ప్రాజెక్టు పనులను పర్యవేక్షించాలని ఇంతకుముందు భావించిన కేఆర్ఎంబీ... తాజాగా మనసు మార్చుకుంది. ఏపీ ప్రభుత్వానికి సమాచారం ఇచ్చాకే ప్రాజెక్టు వద్దకు వెళ్లాలని నిర్ణయించుకుంది.

అవసరమైతే కేంద్ర భద్రతా బలగాల సాయం తీసుకోవాలని కేఆర్ఎంబీ అధికారులు యోచిస్తున్నారు. పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నివారించేందుకు భద్రతా బలగాల రక్షణ తప్పనిసరి అని భావిస్తున్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై జులై 3 లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని కేంద్ర జలశక్తి శాఖ బోర్డును ఆదేశించిన సంగతి తెలిసిందే.


More Telugu News