మోదీ నేతృత్వంలో కీలక భేటీ.. హాజరైన అమిత్ షా, రాజ్ నాథ్, అజిత్ దోవల్
- భద్రతకు సంబంధించిన అంశాలపై చర్చ
- డ్రోన్ దాడి నేపథ్యంలో భేటీకి ప్రాధాన్యం
- త్వరలోనే భారత్‌కు డ్రోన్ పాలసీ
మోదీ నేతృత్వంలో ఢిల్లీలో కీలక భేటీ జరుగుతోంది. దీంట్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పాల్గొన్నారు. భద్రతకు సంబంధించిన విధానపరమైన నిర్ణయాలపైనే చర్చలు జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.
అలాగే ఇటీవలి డ్రోన్ దాడి నేపథ్యంలో భారత్‌కు డ్రోన్ విధానాన్ని రూపొందించాలన్న దానిపైనే ప్రధానంగా చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో త్వరలోనే భారత్‌కు ఓ డ్రోన్ పాలసీ రాబోతోందని అంతా భావిస్తున్నారు.
మరోవైపు జమ్ములో వాయుసేన స్థావరంపై జరిగిన డ్రోన్ దాడిపై ఎన్‌ఐఏ నేతృత్వంలో దర్యాప్తు ముమ్మరమైంది. డ్రోన్లు ఎక్కడి నుంచి వచ్చాయన్న దానిపై నిఘా వ్యవస్థలు దృష్టి కేంద్రీకరించాయి. ఈ దాడిలో పాక్ హస్తం ఉందని భావిస్తున్న నేపథ్యంలో భారత్-పాక్ మధ్య ఉన్న అంతర్జాతీయ సరిహద్దును దాటి డ్రోన్లు వచ్చి ఉంటాయని అనుమానిస్తున్నారు. అయితే, తిరిగి అవి ఎక్కడికి వెళ్లాయన్నది కూడా ఇప్పుడు చిక్కు ప్రశ్నగా మిగిలిపోయింది.