ముంబై కరోనా టీకా కుంభకోణం: టీకా పేరిట బాధితులకు సెలైన్ వాటర్ ఎక్కించిన వైనం!
- స్పందించిన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి
- బాధితులందరికీ జులైలో యాంటీబాడీ టెస్టులు
- టీకా ఇవ్వలేదని తేలితే వ్యాక్సిన్ ఇస్తామని హామీ
- పక్క రాష్ట్రం నుంచి టీకా బాటిళ్లు తెచ్చి సెలైన్ నింపిన వైనం
- ఇప్పటి వరకు 10 మంది అరెస్టు
ముంబయిలో చోటుచేసుకున్న కరోనా టీకా స్కాంలో దుండగులు బాధితులకు సెలైన్ వాటర్ ఇచ్చినట్లు భావిస్తున్నామని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్ తోపే తెలిపారు. బాధితులందరికీ జులైలో యాంటీబాడీ పరీక్షలు చేయిస్తామని తెలిపారు. దాన్ని బట్టి వారికి టీకా ఇవ్వలేదని తేలితే కేంద్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చి వారందరికీ రెండు డోసుల టీకా ఇస్తామని స్పష్టం చేశారు.
మొత్తం 2040 మంది ఈ కుంభకోణంలో బాధితులుగా మిగిలారని మంత్రి తెలిపారు. దుండగులు పక్క రాష్ట్రం నుంచి టీకా బాటిళ్లు తెప్పించి దాంట్లో సెలైన్ వాటర్ నింపి ఉంటారని భావిస్తున్నామన్నారు. ముంబయిలోని కాండీవాలా ఏరియాలో ఉన్న ఓ హౌసింగ్ సొసైటీలో ఉంటున్న వ్యక్తులందరినీ టీకా వేస్తామంటూ ఓ ముఠా మోసం చేసింది. టీకా పేరిట సెలైన్ వాటర్ ఇచ్చి పరారైనట్లు భావిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ కేసులో 10 మందిని అరెస్టు చేశామని మంత్రి తెలిపారు. అలాగే ఈ విషయానికి సంబంధించి చాలా ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయని పేర్కొన్నారు.