కొత్త ఐటీ నిబంధనలు.. దేశ చట్టాలు అమలు చేయాల్సిందే: పార్లమెంటరీ కమిటీ

  • గూగుల్‌, ఫేస్‌బుక్‌ ప్రతినిధులతో కమిటీ భేటీ
  • ప్రభుత్వ ఆదేశాలు అమలు చేయాల్సిందేనని స్ఫష్టం
  • సమాచార రక్షణలో లోపాలున్నాయని తెలిపిన కమిటీ
కేంద్రం తీసుకొచ్చిన కొత్త ఐటీ నిబంధనలు, భారతదేశ చట్టాలను తప్పక అమలు చేయాల్సిందేనని ఐటీ వ్యవహారాల పార్లమెంటరీ స్థాయి సంఘం.. సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్‌,  సెర్చ్‌ ఇంజిన్‌ గూగుల్‌కు తేల్చి చెప్పింది. అలాగే వినియోగదారుల గోప్యతను కాపాడి పటిష్ఠ భద్రత కల్పించేందుకు కఠినమైన విధానాల్ని అమలు చేయాలని స్పష్టం చేసింది.

సామాజిక మాధ్యమాల్లో పౌరుల రక్షణ, ఆన్‌లైన్ వేదికల దుర్వినియోగ నియంత్రణపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్‌ నేతృత్వంలోని పార్లమెంటరీ కమిటీ-ఐటీ నేడు భేటీ అయ్యింది. దీనికి హాజరు కావాలని ఫేస్‌బుక్‌, గూగుల్‌కు సోమవారమే నోటీసు ఇచ్చారు. ఫేస్‌బుక్‌ తరఫున పబ్లిక్‌ పాలసీ విభాగం డైరెక్టర్‌ శివనాథ్‌ తుక్రల్‌, అసోసియేట్‌ జనరల్‌ కౌన్సిల్‌ నమ్రతా సింగ్‌ కమిటీ ముందు హాజరయ్యారు. గూగుల్‌ తరఫున ప్రభుత్వ వ్యవహారాలు, పబ్లిక్‌ పాలసీ చీఫ్‌ అమన్‌ జైన్‌, న్యాయ విభాగం డైరెక్టర్‌ గీతాంజలి దుగ్గల్‌ కమిటీ ముందుకు వచ్చారు.

కొత్త ఐటీ నిబంధనలతో పాటు ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలు, కోర్టు తీర్పులను సైతం అమలు చేయాలని కమిటీ స్పష్టం చేసింది. వినియోగదారుల సమాచారాన్ని భద్రపరచడంలో ఇరు సంస్థల విధానాల్లో లోపాలున్నాయని తెలిపింది.


More Telugu News