ట్విట్టర్ లో బాలల అశ్లీల కంటెంట్... కేసు నమోదు

  • మరో వివాదంలో ట్విట్టర్
  • ట్విట్టర్ ను లక్ష్యంగా చేసుకున్న ఎన్సీపీసీఆర్
  • బాలల అశ్లీల కంటెంట్ ఉండడంపై ఆగ్రహం
  • ఢిల్లీ సైబర్ పోలీసులకు పదే పదే ఫిర్యాదు
  • తాజాగా సమన్లు
  • ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సైబర్ సెల్
నూతన ఐటీ విధానం విషయంలో కేంద్రంతో విభేదిస్తోన్న ట్విట్టర్ కు మరో చిక్కొచ్చిపడింది. ట్విట్టర్ లో బాలల అశ్లీల కంటెంట్ (చైల్డ్ పోర్నోగ్రఫీ) ఉందంటూ ఎన్సీపీసీఆర్ (జాతీయ బాలల హక్కుల రక్షణ కమిషన్ ) ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదును స్వీకరించిన ఢిల్లీ సైబర్ పోలీసులు ట్విట్టర్ పై కేసు నమోదు చేశారు. వాస్తవానికి ట్విట్టర్ కు వ్యతిరేకంగా ఎన్సీపీసీఆర్ కొన్నిరోజుల కిందటే పలుమార్లు ఫిర్యాదు చేసింది. అయినప్పటికీ ఢిల్లీ సైబర్ పోలీసులు స్పందించకపోవడంతో ఎన్సీపీసీఆర్ తాజాగా సమన్లు పంపింది. ఈ నేపథ్యంలో, ట్విట్టర్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు ఢిల్లీ సైబర్ సెల్ డీసీపీ అన్యేష్ రాయ్ వెల్లడించారు.


More Telugu News