భారత్ కో-విన్ సిస్టంపై ఆసక్తిని ప్రదర్శిస్తున్న 50 దేశాలు
- వ్యాక్సినేషన్ డీటెయిల్స్ మొత్తం కో-విన్ లో రిజిస్టర్ అవుతున్న వైనం
- ఈ సిస్టంపై ఆసక్తి చూపుతున్న కెనడా, లాటిన్ అమెరికా, ఆఫ్రికా దేశాలు
- ఉచితంగా అందించేందుకు సిద్ధంగా ఉన్న భారత్
కరోనా మహమ్మారిని కట్టడి చేసే ప్రయత్నంలో భారత ప్రభుత్వం కట్టుదిట్టంగా వ్యవహరిస్తోంది. ప్రజలందరికీ వ్యాక్సిన్ వేయించేందుకు కృషి చేస్తోంది. దేశంలో ఎవరు, ఎక్కడ వ్యాక్సిన్ వేయించుకున్నా వారి వివరాలు కో-విన్ సిస్టమ్ లో రిజిస్టర్ అవుతున్నాయి. తద్వారా ఎవరు ఎప్పుడు వ్యాక్సిన్ వేయించుకున్నారు? ఏ వ్యాక్సిన్ వేయించుకున్నారు? అనే వివరాలు కేంద్రానికి ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతున్నాయి. ఈ డేటా ఆధారంగా కేంద్రం తరుపరి కార్యాచరణను చేపట్టడానికి వీలుపడుతోంది.
మరోవైపు, కో-విన్ సిస్టమ్ పలు దేశాలను ఆకర్షిస్తోంది. ఈ తరహా సిస్టమ్ ను అమలు చేయడానికి కెనడా, మెక్సికో, పనామా, నైజీరియా తదితర 50 దేశాలు ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నాయి. మరోవైపు ఈ దేశాలకు భారత ప్రభుత్వం కూడా అండగా నిలిచేందుకు సిద్ధంగా ఉంది. కో-విన్ సాఫ్ట్ వేర్ ను ఆయా దేశాలకు అందించేందుకు సుముఖతను వ్యక్తం చేస్తోంది.
కోవిడ్ 19 వ్యాక్సినేషన్ అడ్మినిస్ట్రేషన్ ఛైర్మన్ డాక్టర్ ఆర్ఎస్ శర్మ ఈ సందర్భంగా మాట్లాడుతూ, కో-విన్ కు సంబంధించి ఓపెన్ సోర్స్ వెర్షన్ ప్లాట్ ఫామ్ ను తయారు చేయాలని ప్రధాని మోదీ ఆదేశించారని చెప్పారు. ఈ ప్లాట్ ఫామ్ పై మధ్య ఆసియా, లాటిన్ అమెరికా, ఆఫ్రికా దేశాలు ఆసక్తిని చూపుతున్నాయని తెలిపారు. ఈ సిస్టమ్ ఎంత గొప్పగా పని చేస్తోందో ప్రపంచ దేశాలకు తాము చెపుతున్నామని, అన్ని దేశాలకు ఉచితంగా అందించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.