'ఎన్టీఆర్, రామ్ చరణ్'లకు హెల్మెట్లు తగిలించిన సైబరాబాద్ పోలీసులు!
- ఆర్ఆర్ఆర్ నుంచి కొత్త పోస్టర్ రిలీజ్
- బైక్ పై జాలీగా వెళుతున్న ఎన్టీఆర్, రామ్ చరణ్
- గ్రాఫిక్స్ తో సృజనాత్మకత చాటిన సైబర్ పోలీసులు
- హెల్మెట్ ధరిస్తే సురక్షితంగా ఉంటారని వెల్లడి
రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధానపాత్రల్లో నటిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ చిత్రం నుంచి చాన్నాళ్ల తర్వాత అభిమానులను అలరించే రీతిలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ల పోస్టర్ రిలీజైంది. దీంట్లో ఎన్టీఆర్ బైక్ నడుపుతుండగా, రామ్ చరణ్ వెనుక కూర్చుని ఉండడం చూడొచ్చు. ఇద్దరూ జాలీ మూడ్ లో ఉన్నట్టు వాళ్ల హావభావాలు చెబుతున్నాయి. అయితే, ఇది సినిమా స్టిల్ అయినా, సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తమ సృజనాత్మకను చూపిస్తూ, ఈ ఫొటో సాయంతో ప్రజల్లో హెల్మెట్లపై అవగాహన పెంచేందుకు ప్రయత్నించారు.
ఈ పోస్టర్ లో హెల్మెట్లు లేకుండా బైక్ పై వెళుతున్న ఎన్టీఆర్, రామ్ చరణ్ లకు గ్రాఫిక్స్ సాయంతో హెల్మెట్లు తగిలించారు. "ఇప్పుడు పర్ఫెక్ట్ గా ఉంది... హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ఉండండి" అంటూ క్యాప్షన్ పెట్టారు. దీనిపై ఆర్ఆర్ఆర్ చిత్రబృందం కూడా సమయోచితంగా స్పందించింది. "ఇప్పటికీ సరిగ్గా లేదు... బండికి నంబరు ప్లేట్ మిస్సయింది" అంటూ ఛలోక్తి విసిరింది. సామాజిక మాధ్యమాల్లో ఈ పిక్ వైరల్ అవుతోంది.