ఆళ్లగడ్డ ఘటనపై అడిషనల్ డీజీపీకి ఫిర్యాదు చేసిన ఏపీ బీజేపీ నేతలు
- ఆళ్లగడ్డలో హసన్ అనే వ్యక్తిపై దాడి
- వైసీపీ నేతలు హత్యాయత్నం చేశారన్న బీజేపీ నేతలు
- ఇసుక అవినీతిని ప్రశ్నించడమే కారణమని వివరణ
- అదనపు డీజీపీ రవిశంకర్ అయ్యన్నార్ ను కలిసిన విష్ణు
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో హసన్ అనే బీజేపీ నేతపై హత్యాయత్నం చేశారంటూ ఏపీ బీజేపీ నేతలు వైసీపీ నేతలపై తీవ్ర ఆరోపణలు చేయడం తెలిసిందే. స్థానిక ఎమ్మెల్యేని ఇసుక అవినీతిపై ప్రశ్నించడంతో హసన్ పై దాడి చేశారని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలో ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి అడిషనల్ డీజీపీ రవిశంకర్ అయ్యన్నార్ ను కలిసి ఫిర్యాదు చేశారు. ఆళ్లగడ్డ బీజేపీ నేత హసన్ పై వైసీపీ నాయకులు హత్యాయత్నం చేశారని అడిషనల్ డీజీపీకి వివరించారు.
అంతేకాదు, విశాఖలో నేడు ఏబీవీపీ రాష్ట్రనేత జగదీశ్, బీజేపీ యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రమోహన్ లపైనా, ఇతర జిల్లాల్లో బీజేవైఎం, బీజేపీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేశారంటూ తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. వైసీపీ ఎమ్మెల్యేల అనుచరులకు సహకరిస్తున్న పోలీసులపైనా చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు అడిషనల్ డీజీపీకి విజ్ఞప్తి చేశారు. తమ ఫిర్యాదు పట్ల స్పందించకపోతే రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేపడతామని బీజేపీ నేతలు స్పష్టం చేశారు.