'పుష్ప' నుంచి త్వరలో ఫస్టు సింగిల్!

  • ముగింపు దశలో 'పుష్ప'
  • ప్రత్యేక ఆకర్షణగా దేవిశ్రీ సంగీతం
  • గిరిజన యువతిగా రష్మిక
  • అందరిలో పెరుగుతున్న ఆసక్తి  
అల్లు అర్జున్ .. సుకుమార్ కాంబినేషన్లో 'పుష్ప' సినిమా రూపొందుతోంది. చిత్రీకరణ పరంగా ఈ సినిమా ముగింపు దశకి చేరుకుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాకి అదనపు బలంగా నిలుస్తుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఒక లిరికల్ వీడియోను వదలడానికి మేకర్స్ సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. ఇంకా డేటు .. టైమ్ అనుకోలేదట. త్వరలోనే అందుకు సంబంధించిన వివరాలను వెల్లడించనున్నట్టు చెప్పుకుంటున్నారు.

అడవి నేపథ్యం .. రహస్యంగా జరిగే ఎర్రకలప అక్రమ రవాణా .. గిరిజన యువతిగా రష్మిక .. గూడెం ప్రజల్లో హుషారెత్తించే ఐటమ్ సాంగ్ .. ఇవన్నీ కూడా ఆసక్తిని రేకెత్తించే అంశాలే. అందువలన ఈ సినిమా నుంచి ఎలాంటి అప్ డేట్ వస్తుందన్నా అంతా ఆత్రుతను చూపుతున్నారు. ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ ఒక రేంజ్ లో ఉంటాయనే విషయం ఆల్రెడీ జనంలోకి వెళ్లిపోయింది. ఇక లిరికల్ వీడియోతో డాన్సులు గట్రా ఎలా ఉంటాయనేది శాంపిల్ చూపించనున్నారు. ఫహాద్ ఫాజిల్ విలనిజం ఈ సినిమాకి హైలైట్ కానుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


More Telugu News