మరోసారి పెరిగిన పెట్రోల్ ధరలు.. బెంబేలెత్తుతున్న సామాన్యులు
- క్రమం తప్పకుండా పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలు
- ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 98.81
- హైదరాబాదులో లీటర్ పెట్రోల్ రూ. 102.69
మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. వీటి ధరలు క్రమం తప్పకుండా పెరుగుతూ ఉండటంతో... నిత్యావసర వస్తువుల ధరలు కూడా ఆకాశాన్నంటుతున్నాయి. తాజాగా మరోసారి పెట్రో ధరలు పెరిగాయి. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ పై 23 పైసలు, డీజిల్ పై 30 పైసలు పెరిగింది. పెరిగిన ధరతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 98.81కి, డీజిల్ రూ. 89.18కి చేరింది.
హైదరాబాదులో కూడా పెట్రోల్ ధర ఇప్పటికే సెంచరీ దాటిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం భాగ్యనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 102.69, డీజిల్ ధర రూ. 97.20కి చేరింది. ఏపీ విషయానికి వస్తే... విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ. 104.82గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ రూ. 104.90, డీజిల్ రూ. 97.20కి చేరుకుంది.