ఈ శతాబ్దపు గణిత సమస్యగా నిలిచిన 'రైమాన్ హైపోథిసిస్'ను పరిష్కరించిన హైదరాబాదీ!
- శ్రీనిధి ఇనిస్టిట్యూట్ లో పనిచేస్తున్న డాక్టర్ ఈశ్వరన్
- 19వ శతాబ్దంలో సవాల్ విసిరిన బెర్నార్డ్ రైమాన్
- ఇంత కాలానికి పరిష్కారాన్ని కనుగొన్న ఈశ్వరన్
19వ శతాబ్దంలో తొలిసారిగా వెలుగులోకి వచ్చి, ఈ శతాబ్దపు అతిపెద్ద గణిత సమస్యగా నిలిచిన 'రైమాన్ హైపోథిసిస్' (ప్రైమ్ నంబర్స్ డిస్ట్రిబ్యూషన్)ను హైదరాబాద్ కు చెందిన శ్రీనిధి ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మ్యాథ్స్ ప్రొఫెసర్ డాక్టర్ కుమార్ ఈశ్వరన్ (74) సాల్వ్ చేశారు. ఈ సమస్య సాధన కోసం ప్రపంచం 161 సంవత్సరాలు నిరీక్షించడం గమనార్హం. ఈ శతాబ్దపు టాప్ 10 గణిత సమస్యల్లో 'రైమాన్ హైపోథిసిస్' తొలి స్థానంలో ఉంది.
ఇక ఈ సమస్యను పరిష్కరిస్తే మిలియన్ డాలర్ల బహుమతిని ఇస్తామని ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీతో పాటు క్లే మ్యాథమేటిక్స్ ఇనిస్టిట్యూట్ కూడ ప్రకటించింది. తన తాజా పరిశోధనపై మాట్లాడిన డాక్టర్ ఈశ్వరన్, "ఈ ఫార్ములాను ఛేదించే రుజువును 2016లోనే నేను అందించాను. 19వ శతాబ్దంలో గొప్ప గణిత శాస్త్రవేత్తగా పేరున్న జార్జ్ ఫ్రెడ్రిక్ బెర్నార్డ్ రైమాన్ ఈ ఫార్ములాను తొలిసారిగా వెలుగులోకి తెచ్చారు. నేను దీనిపై ఎన్నో వారాలు పని చేశాను. 2018-19లో ఈ విషయంపై ఎన్నో ప్రసంగాలు కూడా చేశాను" అని అన్నారు.
వాస్తవానికి రైమాన్ హైపోథిసిస్ ప్రధాన సంఖ్యలను ఎలా వర్గీకరించాలన్న విషయమై ఎంతో సులభతర మార్గాన్ని చూపుతుంది. అయితే, అది ఎలాగన్న విషయం మాత్రం పూర్తి సస్పెన్స్. దీన్ని సాల్వ్ చేసేందుకు ఎంతో మంది ప్రయత్నించినా, లక్ష్యాన్ని మాత్రం చేరలేకపోయారు. అయితే, ఓ క్రమ పద్ధతిలో పరిశీలిస్తూ ముందుకుసాగడంతో పాటు, కేవలం సంఖ్యాశాస్త్రాన్ని మాత్రమే నమ్మకుండా మిగతా మార్గాలను కూడా ఎంచుకుని దీనికి పరిష్కారాన్ని కనుగొన్నామని డాక్టర్ ఈశ్వరన్ తెలిపారు.
కాగా, డాక్టర్ ఈశ్వరన్ సాధించిన ఈ విజయాన్ని ఎంతో మంది ఇప్పటికే గుర్తించారు. నిపుణుల కమిటీలు ఆయన సూత్రాలను పరిశీలించి, రైమాన్ హైపోథిసిస్ పై ఈశ్వరన్ గెలిచారని ప్రకటించారు. దాదాపు 1200 మంది గణిత శాస్త్రవేత్తలు, రీసెర్చ్ స్కాలర్లను ఆహ్వానించి, రైమాన్ విసిరిన సవాలుకు ఈశ్వరన్ జవాబును గురించి వివరించి, అభిప్రాయాలు సేకరించి, బహిరంగ సమీక్ష జరిపిన తరువాతే ఆ సమస్యను ఈశ్వరన్ పరిష్కరించారని తేల్చారు.