మావోయిస్టు హిడ్మా జీవించే ఉన్నారని మీడియాకు లేఖ!
- ఇటీవల హిడ్మా మరణించినట్టు వార్తలు
- పోలీసులే దుష్ప్రచారం చేస్తున్నారు
- ఆయన భార్య కూడా జీవించే ఉన్నారు
- మీడియాకు పార్టీ అధికార ప్రతినిధి జగన్ లేఖ
కరోనా మహమ్మారి సోకి మావోయిస్టు నేత హిడ్మా, ఆయన భార్య మరణించారని వచ్చిన వార్తలు అవాస్తవమని ఆ పార్టీ అధికార ప్రతినిధి జగన్ నుంచి లేఖ వచ్చింది. ఇది పోలీసులు చేస్తున్న దుష్ప్రచారం మాత్రమేనని, ఒడిశా మీడియా ప్రతినిధులకు పంపిన లేఖలో జగన్ ఆరోపించారు. ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని అన్నారు.
తీవ్ర అనారోగ్యం బారిన పడిన సొబ్రం, గంగాల్ లను ఆసుపత్రికి పంపించామని, విషయం తెలుసుకున్న పోలీసులు, కనీసం వారి ఆరోగ్యం గురించి కూడా ఆలోచించకుండా, మరణానికి కారకులయ్యారని జగన్ అన్నారు. హరిభూషణ్, భారతక్కలకు సరైన వైద్యం అందలేదని, అదే వారి మరణానికి కారణమని అన్నారు. మావోయిస్టు పార్టీని అంతమొందించే కుట్రలు జరుగుతున్నాయని, జరుగుతున్న ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని సూచించారు.