రూ.126 కోట్ల విలువ చేసే హెరాయిన్ పట్టివేత!
- ఢిల్లీ విమానాశ్రయంలో ఘటన
- దక్షిణాఫ్రికాకు చెందిన దుండగులు
- బ్యాగుల్లో 18 కిలోల హెరాయిన్ తరలింపు
- దుబాయ్‌లో ఆగిన నిందితులు
- పోలీసుల అదుపులో ఉన్న దుండగులు
ఢిల్లీ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీ ఎత్తున మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో రూ.126 కోట్ల విలువ చేసే 18 కిలోల హెరాయిన్‌ను అధికారులు పట్టుకున్నారు. దక్షిణాఫ్రికాలో జోహెన్నస్‌బర్గ్ నుంచి వస్తున్న ఇద్దరు అనుమానితుల్ని అధికారులు తనిఖీ చేయగా.. అసలు విషయం బయటపడింది.
దక్షిణాఫ్రికా నుంచి జూన్ 27న బయలుదేరిన వీళ్లు తొలుత దుబాయ్ చేరుకున్నారు. అక్కడి నుంచి బయలుదేరి ఈరోజు ఉదయం ఢిల్లీలో దిగారు. వారి వద్ద ఉన్న ట్రాలీ బ్యాగ్ కింది భాగంలో హెరాయిన్‌ను దాచి పెట్టగా అధికారులు గుర్తించి పట్టుకున్నారు. ఒకరి బ్యాగ్‌లో 10 కిలోలు.. మరొకరి బ్యాగ్‌లో 8 కిలోలు ఉన్నట్లు గుర్తించారు. ప్రస్తుతం వీరిని అదుపులోకి తీసుకున్న అధికారులు విచారణ జరుపుతున్నారు.