నేను కేసీఆర్ సమావేశానికి వెళ్లడం వల్ల బీజేపీ బతికిపోయింది... లేకుంటేనా!: మోత్కుపల్లి
- నిన్న ప్రగతిభవన్ లో అఖిలపక్ష సమావేశం
- సీఎం దళిత్ ఎంపవర్ మెంట్ పై చర్చ
- సమావేశాన్ని బహిష్కరించిన బీజేపీ
- హాజరైన బీజేపీ నేత మోత్కుపల్లి
నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సీఎం దళిత్ ఎంపవర్ మెంట్ కార్యాచరణపై అఖిలపక్ష సమావేశం నిర్వహించడం తెలిసిందే. ఈ సమావేశాన్ని బీజేపీ బహిష్కరించింది. బీజేపీ నేత మోత్కుపల్లి నర్సింహులు మాత్రం ఈ సమావేశానికి హాజరయ్యారు. కానీ బీజేపీ పార్టీ దళితులపై నిర్వహించిన కార్యక్రమానికి మాత్రం ఆయన గైర్హాజరయ్యారు. దీనిపై తెలంగాణ బీజేపీ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేస్తుండడంతో మోత్కుపల్లి వివరణ ఇచ్చారు.
సీఎం కేసీఆర్ నిర్వహించిన అఖిలపక్షం సమావేశానికి తాను వెళ్లబట్టి సరిపోయిందని, లేకపోతే బీజేపీ పార్టీపై దళిత వ్యతిరేక పార్టీ అనే ముద్ర పడేదని వెల్లడించారు. తాను ఈ సమావేశానికి హాజరవడం వల్ల బీజేపీ బతికిపోయిందన్నారు. ఇలాంటి పరిస్థితి నుంచి తాను బీజేపీని కాపాడానని మోత్కుపల్లి చెప్పుకొచ్చారు. దళితుల అభ్యున్నతిని కాంక్షిస్తూ గతంలో ఎన్నడూ ఇంతటి సుదీర్ఘ సమావేశం జరగలేదని అన్నారు.