జమ్మూకశ్మీర్‌లో పోలీసులకు చిక్కిన కరుడు గట్టిన ఉగ్రవాది!
- లష్కరే తోయిబాకు గట్టి ఎదురుదెబ్బ
- ఓ చెక్‌పోస్ట్ వద్ద చిక్కిన నదీమ్ అబ్రార్
- గతంలో జరిపిన అనేక దాడుల్లో కీలక నిందితుడు
- తుపాకి, గ్రనేడ్ స్వాధీనం
జమ్మూకశ్మీర్‌లో లష్కరే తోయిబా ఉగ్రముఠాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఉగ్రసంస్థకు చెందిన కీలక కమాండర్ నదీమ్ అబ్రార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఇతను భద్రతా బలగాలు, సామాన్య పౌరులపై గతంలో జరిపిన అనేక దాడుల్లో పాల్గొన్నట్లు ఆధారాలు ఉన్నాయి.
అబ్రార్ అరెస్టు భద్రతా బలగాలకు పెద్ద విజయమని కశ్మీర్ జోన్ ఐజీపీ విజయ్ కుమార్ తెలిపారు. పరీంపొర ప్రాంతంలో ఓ చెక్‌పోస్టు వద్ద మరో అనుమానితునితో కలిసి అబ్రార్‌ను భద్రతా బలగాలు అరెస్టు చేసినట్లు సమాచారం. వీరి నుంచి ఓ తుపాకి, గ్రనేడ్‌ను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. గత ఏడాది లవాయ్‌పొరలో ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్లను చంపిన ముఠాలో అబ్రార్ కూడా కీలక పాత్ర పోషించినట్లు భద్రతా బలగాలు భావిస్తున్నాయి.