శర్వానంద్ 30వ సినిమాగా 'ఒకే ఒక జీవితం' .. ఫస్టులుక్
- శర్వానంద్ నుంచి మరో చిత్రం
- కథానాయికగా రీతూ వర్మ
- దర్శకుడిగా శ్రీ కార్తీక్
- కీలకమైన పాత్రలో అమల అక్కినేని
శర్వానంద్ మొదటి నుంచి కూడా కొత్తదనానికి ప్రాధాన్యతనిస్తూ వస్తున్నాడు. కెరియర్ పరంగా ఆయన హడావిడిపడుతూ సినిమాలు చేసిన సందర్భాలు కనిపించవు. నిదానమే ప్రధానం అన్నట్టుగా ఆయన ఒక్కో సినిమా చేసుకుంటూ వెళుతున్నాడు. ఇటీవల కాలంలో ఆయన చేసిన సినిమాలు అభిమానులను నిరాశ పరుస్తూ వెళుతున్నాయి. ఈ నేపథ్యలోనే ఆయన అజయ్ భూపతి దర్శకత్వంలో 'మహాసముద్రం' చేస్తున్నాడు. భారీ బడ్జెట్ తో నిర్మితమవుతున్న ఈ సినిమా సీరియస్ డ్రామాగా సాగనుంది.
ఈ నేపథ్యంలో శర్వానంద్ సరదాగా సాగే ఒక కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు .. ఆ సినిమా పేరే 'ఒకే ఒక జీవితం'. కెరియర్ పరంగా ఇది ఆయనకి 30వ సినిమా. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్టులుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. పల్లెకీ .. పట్టణానికి మధ్య హీరో జీవితం ఎలా సాగింది? ఆయనకి ఎదురైన అనుభవాలు ఎలాంటివి? అనే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చుట్టూ ఈ కథ తిరగనున్నట్టుగా తెలుస్తోంది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ సినిమాకి శ్రీ కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నాడు. రీతూ వర్మ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో, అమల అక్కినేని ఒక కీలకమైన పాత్రలో కనిపించనున్నారు. వెన్నెల కిషోర్ .. ప్రియదర్శి ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు.