ఇసుకపై అవినీతిని ప్రశ్నించిన బీజేపీ కార్యకర్తను హత్య చేయాలని ప్రయత్నిస్తారా?: సోము వీర్రాజు
- ఆళ్లగడ్డలో ఘటన
- బీజేపీ కార్యకర్త హసన్ పై దాడి చేశారన్న సోము
- అవినీతిపై స్థానిక ఎమ్మెల్యేని నిలదీశాడని వెల్లడి
- పోలీసులపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్
ఇసుకపై అవినీతి విషయంలో ప్రశ్నించిన ఆళ్లగడ్డ బీజేపీ కార్యకర్త హసన్ ను వైసీపీ ఎమ్మెల్యే గంగుల నాని తన పార్టీ కార్యకర్తలతో కిడ్నాప్ చేసి హత్య చేయాలని ప్రయత్నించాడని ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకు స్థానిక పోలీసులు కూడా ఎమ్మెల్యేకి సహకరించారని ఆరోపించారు. జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఎలా పాతరేసిందో చెప్పడానికి ఈ సంఘటనే ప్రత్యక్ష నిదర్శనం అని వెల్లడించారు.
ఇటువంటి దాడులతో ఏ బీజేపీ కార్యకర్త కూడా బెదిరిపోడని స్పష్టం చేశారు. ఇంకా రెట్టింపు తెగువ చూపి ప్రభుత్వ దాష్టీకాలను ఎదుర్కొంటామని, రాష్ట్రానికి చేస్తున్న అన్యాయాలను ప్రజలకు తెలియజేసి, ప్రభుత్వాన్ని నడిరోడ్డుపై నిలబెడతామని పేర్కొన్నారు.
ఆళ్లగడ్డ దాడికి కారణమైన స్థానిక ఎమ్మెల్యేతో పాటు వారి అనుచరులపైనా, వారికి సహకరించిన పోలీసులపైనా వెంటనే చర్యలు తీసుకోవాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. లేదంటే, ఈ సర్కారు దాడులను రాష్ట్రవ్యాప్తంగా ఉక్కుపాతరేసే సమయం దగ్గరపడుతుంది జాగ్రత్త అంటూ హెచ్చరించారు. అంతేకాకుండా, బీజేపీ కార్యకర్త హసన్ కు తగిలిన గాయాల ఫొటోలు, వీడియోను కూడా సోము వీర్రాజు ట్విట్టర్ లో పంచుకున్నారు.