ఏపీలో మరో 2,224 మందికి కరోనా పాజిటివ్
- ఏపీలో బాగా తగ్గిన కరోనా కేసులు
- గత 24 గంటల్లో 71,758 కరోనా పరీక్షలు
- చిత్తూరు జిల్లాలో 409 కేసులు
- అత్యల్పంగా శ్రీకాకుళం జిల్లాలో 51 కేసులు
- రాష్ట్రవ్యాప్తంగా 31 మంది మృతి
ఏపీలో కరోనా వ్యాప్తి క్రమంగా అదుపులోకి వస్తోంది. గడచిన 24 గంటల్లో 71,758 కరోనా పరీక్షలు నిర్వహించగా 2,224 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 409 పాజిటివ్ కేసులు నమోదు కాగా, తూర్పు గోదావరిలో 299, పశ్చిమ గోదావరిలో 259 కేసులు వెల్లడయ్యాయి. అత్యల్పంగా శ్రీకాకుళం జిల్లాలో 51 కేసులు గుర్తించారు.
అదే సమయంలో 4,714 మంది కరోనా నుంచి సంపూర్ణంగా కోలుకోగా, 31 మంది మరణించారు. చిత్తూరు జిల్లాలో ఆరుగురు, కృష్ణా జిల్లాలో ఐదుగురు కరోనాతో కన్నుమూశారు. ఇక రాష్ట్రంలో ఇప్పటివరకు 18,82,096 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 18,27,214 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 42,252 మందికి చికిత్స జరుగుతోంది. రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 12,630కి చేరింది.