అమరావతిలోని విద్యాసంస్థల్లో చదివిన విద్యార్థులకు అద్భుత అవకాశాలు రావడం హర్షణీయం: చంద్రబాబు

  • విద్యాసంస్థల పనితీరు అమోఘమన్న చంద్రబాబు
  • తొలి బ్యాచ్ విద్యార్థులపైనా ప్రశంసలు
  • రూ.50 లక్షల జీతంతో ఉద్యోగాలు లభిస్తున్నాయని వెల్లడి
  • తమ విజన్ కు ఇవే నిదర్శనాలని స్పష్టీకరణ
అమరావతిలోని విద్యాసంస్థల్లో చదివిన తొలి బ్యాచ్ విద్యార్థులకు రూ.40 లక్షల నుంచి రూ.50 లక్షల వేతన శ్రేణితో అద్భుత ఉద్యోగ అవకాశాలు లభిస్తుండడం సంతోషం కలిగిస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తెలిపారు. అమరావతిలోని విద్యాసంస్థలు మెరుగైన ప్రమాణాలు ప్రదర్శించడం హర్షణీయమని పేర్కొన్నారు.

ఇక్కడ చదివిన అనేకమంది విద్యార్థులు విదేశాల్లోని ప్రఖ్యాత యూనివర్సిటీల్లో సీట్లు సంపాదిస్తూ తమ తల్లిదండ్రులను గర్వించేలా చేస్తున్నారని వివరించారు. విద్యాపరంగా ఈ యువత తలెత్తుకుని నిలబడడం తనను ఎంతో ఆనందానికి గురిచేస్తోందని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

దక్షిణ భారతదేశంలోనే అమరావతిని సమున్నత విద్యాకేంద్రంగా నిలపాలన్న తమ దార్శనికతకు ఇవే నిదర్శనాలు అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఇంతటి అభివృద్ధిని సాధించిన విద్యార్థులను, విద్యాసంస్థలను అభినందిస్తున్నానని, భవిష్యత్తులోనూ అత్యుత్తమ రీతిలో ఎదగాలని ఆశిస్తున్నట్టు తెలిపారు.


More Telugu News