అన్నాడీఎంకే ఓటమికి కారణం ఇదే: శశికళ
- అందరం కలిసి పనిచేద్దామని చెప్పినా వినలేదు
- నా మాటలను పార్టీ నేతలు పెడచెవిన పెట్టారు
- వారి వల్ల అమ్మ ప్రభుత్వం లేకుండా పోయింది
ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే పార్టీ ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఘన విజయం సాధించిన డీఎంకే అధినేత స్టాలిన్ ముఖ్యమంత్రి పగ్గాలను చేపట్టారు. మరోవైపు ధర్మపురికి చెందిన బాలు అనే కార్యకర్తతో అన్నాడీఎంకే బహిష్కృత నాయకురాలు శశికళ మాట్లాడిన మాటల ఆడియో వెలుగులోకి వచ్చింది.
అందరం కలిసి ఐకమత్యంలో పనిచేద్దామని తాను చెప్పిన మాటలను పెడచెవిన పెట్టడం వల్లే అన్నాడీఎంకే ఓడిపోయిందని శశికళ చెపుతున్నట్టు ఆ ఆడియోలో ఉంది. బెంగళూరు జైలు నుంచి విడుదలై తాను చెన్నైకి బయల్దేరినప్పుడే కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చానని ఆమె అన్నారు.
అయితే తన మాటలను పార్టీ నేతలు పెడచెవిన పెట్టారని విమర్శించారు. వారి వల్ల ఈరోజు అమ్మ ప్రభుత్వం లేకుండా పోయిందని అన్నారు. ప్రతి ఊరి నుంచి కార్యకర్తలు వారి వేదనను తనతో పంచుకుంటున్నారని చెప్పారు. ఎంతో కష్టపడి అన్నాడీఎంకేని ఈ స్థాయికి తీసుకొచ్చామని... ఇకపై చేతులు ముడుచుకుని కూర్చోలేమని శశికళ అన్నారు. కార్యకర్తలతో కలిసి పని చేస్తానని చెప్పారు.