తిరుమలలో పెరిగిన రద్దీ!
- నిన్న స్వామిని దర్శించుకున్న 17,824 మంది
- హుండీ ద్వారా రూ. 1.83 కోట్ల ఆదాయం
- తలనీలాలు సమర్పించిన 7,851 మంది
కరోనా రెండో దశ క్రమంగా తగ్గుతున్న నేపథ్యంలో, ఏడు కొండలపై రద్దీ క్రమంగా పెరుగుతోంది. అందునా వారాంతం కావడంతో నిన్న ఆదివారం నాడు స్వామివారిని 17,824 మంది దర్శించుకున్నారు. మే నెల రెండో వారంలో సగటున నాలుగు నుంచి 5 వేల మంది వరకూ మాత్రమే భక్తులు స్వామిని దర్శించుకోగా, ఇప్పుడా సంఖ్య మూడు రెట్లకు పైగా పెరగడం గమనార్హం. ఇదే సమయంలో హుండీ ఆదాయం కూడా పెరిగింది. నిన్న హుండీ ద్వారా రూ. 1.83 కోట్ల ఆదాయం లభించినట్టు టీటీడీ అధికారులు వెల్లడించారు. ఇదే సమయంలో 7,851 మంది తలనీలాలు సమర్పించారు.