క్వారంటైన్ లో 'మాక్ డక్'ను తెగ లాగించేస్తున్న భారత క్రికెటర్లు... తయారీ విధానం వీడియో ఇదిగో!
- ప్రస్తుతం ముంబై హోటల్ లో టీమ్
- చెఫ్ రాకేశ్ కాంబ్లే చేతుల మీదుగా వంటకాలు
- వీడియోను పంచుకున్న బీసీసీఐ
మన క్రికెటర్లు ఇప్పుడు ఓ వంటకాన్ని తెగ లాగించేస్తున్నారు. దాని పేరు 'మాక్ డక్'. త్వరలోనే శ్రీలంక పర్యటనకు వెళ్లనున్న భారత క్రికెట్ జట్టు, ఇప్పుడు ముంబై నగరంలోని ఒక ఫైవ్ స్టార్ హోటల్ లో క్వారంటైన్ లో వుంది. వీరి క్వారంటైన్ గడువు నేటితో ముగియనుండగా, ఆపై జట్టు కొలంబోకు బయలుదేరనుంది. ఈ నేపథ్యంలో ఆటగాళ్లంతా, స్టార్ చెఫ్ రాకేశ్ కాంబ్లే తయారు చేసిన శాకాహార వంటకం 'మాక్ డక్'ను లొట్టలేసుకుంటూ తినేస్తున్నారట.
ఈ విషయాన్ని స్వయంగా తెలిపిన చెఫ్, రాకేశ్ కాంబ్లే, వంటకం తయారీ విధానం వీడియోను పంచుకున్నారు. ఇక ఈ వంటకం సంజూ శాంసన్ కు, ధావన్ కు ఇష్టమని, పాండ్యా సోదరులైతే, కనీసం మూడు నాలుగు రోజులకు ఒకసారి తింటారని రాకేశ్ తెలిపారు. 'మాక్ డక్' వంటకాన్ని తయారు చేస్తున్న విధానం వీడియోను బీసీసీఐ షేర్ చేసింది.
ఇక శ్రీలంక పర్యటనకు తొలిసారిగా ఎంపికైన దేవదత్ పడిక్కల్, చేతన్ సకారియా, నితీశ్ రాణా, రుతురాజ్ గైక్వాడ్, కృష్ణప్ప గౌతమ్ వంటి ఆటగాళ్లు, ఈ టోర్నీలో ఎలాగైనా సత్తా చాటాలని భావిస్తున్నారు.