అప్పుడే వైదొలిగిన ట్విట్టర్ గ్రీవెన్స్‌ అధికారి!

  • కొత్త డిజిటల్‌ నిబంధనలు తీసుకొచ్చిన కేంద్రం
  • అమలులో జాప్యం చేసిన ట్విట్టర్‌
  • తాత్కాలిక గ్రీవెన్స్‌ అధికారి నియామకంతో సరి
  • ఆగ్రహం వ్యక్తం చేసిన కేంద్రం
  • మధ్యవర్తిత్వ హోదా రద్దు
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త డిజిటల్‌ నిబంధనలకు అనుగుణంగా భారత్‌లో ట్విట్టర్‌ నియమించిన తాత్కాలిక గ్రీవెన్స్‌ ఆఫీసర్‌ ధర్మేంద్ర చతుర్‌ తన పదవి నుంచి వైదొలిగారు. దీంతో ఆ పదవి ఖాళీ అయినట్లయింది. నిబంధనల ప్రకారం.. ఆ పదవి ఖాళీగా ఉండేందుకు వీలు లేదు. దీనిపై స్పందించడానికి ట్విట్టర్‌ నిరాకరించింది.

సామాజిక మాధ్యమం ట్విట్టర్‌, కేంద్ర ప్రభుత్వం మధ్య గత కొన్ని రోజులుగా ఘర్షణపూరిత వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. కేంద్రం తీసుకొచ్చిన కొత్త డిజిటల్‌ నిబంధనల అమలులో ట్విట్టర్‌ జాప్యం చేసింది. దీనిపై తీవ్రంగా స్పందించిన కేంద్రం ట్విట్టర్‌కు ఉన్న మధ్యవర్తిత్వ హోదాను రద్దు చేసింది. దీంతో వినియోగదారుల పోస్టులకు ట్విట్టర్‌ కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఇటీవల యూపీలో ట్విటర్‌పై కేసు కూడా నమోదు చేసిన విషయం తెలిసిందే.


More Telugu News