ఈ నెల 29న రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ సాధన దీక్షలు
- కరోనా బాధితులకు ప్రభుత్వం సాయం అందించాలని డిమాండ్
- 175 నియోజకవర్గాల్లో దీక్షలు
- పిలుపునిచ్చిన పార్టీ హైకమాండ్
- మంగళగిరిలో చంద్రబాబు దీక్ష
కరోనా బాధితులకు ప్రభుత్వం సాయం అందించాలన్న డిమాండుతో టీడీపీ రాష్ట్రవ్యాప్తంగా దీక్షలు చేపడుతోంది. ఈ నెల 29న సాధన దీక్ష పేరుతో రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో దీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు టీడీపీ అధినాయకత్వం పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు మంగళగిరిలోని కేంద్ర కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి దీక్షలో పాల్గొననున్నారు.
రేవంత్ రెడ్డిని అభినందించిన చంద్రబాబు?
నాలుగేళ్ల కిందట టీడీపీని వీడి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన రేవంత్ రెడ్డి తెలంగాణ పీసీసీ చీఫ్ గా నియమితుడైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు... రేవంత్ ను అభినందించినట్టు ప్రచారం జరుగుతోంది. టీడీపీలో ఉన్న సమయంలో రేవంత్ రెడ్డి పార్టీ చీఫ్ చంద్రబాబును విశేషంగా అభిమానించేవారు. పైగా పార్టీని వీడిన సమయంలోనూ ఇతరుల్లా కాకుండా, చంద్రబాబుపై ఒక్క విమర్శ కూడా చేయలేదు. పైగా, చంద్రబాబును కలిసి తాను పార్టీని వీడడానికి గల కారణాలను వివరించినట్టు తెలిసింది.