ఎస్సీ సాధికారతపై కేసీఆర్ అఖిలపక్ష భేటీ ప్రారంభం.. కీలక సూచనలు చేసిన సీఎం
- పేద ఎస్సీ కుటుంబాల అభివృద్ధే లక్ష్యం
- ఎస్సీల కష్టాలు తొలగిపోవాలి
- దశలవారీగా కార్యాచరణ అమలుకు ప్రభుత్వం సిద్ధం
- దళిత సాధికారతకు పైరవీలకు ఆస్కారం లేని పారదర్శక విధానం
రాష్ట్రంలోని నిరు పేద ఎస్సీ కుటుంబాలను అన్ని రంగాల్లో దశల వారీగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా దళిత సాధికారత పథకాన్ని అమలు చేయాలని భావిస్తోన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దాని విధివిధానాల కోసం ఎస్సీ ప్రజాప్రతినిధులు, నేతలతో అఖిలపక్ష సమావేశంలో చర్చిస్తున్నారు. ప్రగతిభవన్ వేదికగా జరుగుతోన్న ఈ సమావేశానికి రాష్ట్రంలోని ఎస్సీ ప్రజాప్రతినిధులతో పాటు బీజేపీ, మజ్లిస్, సీపీఎం, సీపీఐ పార్టీల నేతలు హాజరయ్యారు. సీనియర్ ఎస్సీ నేతలు కడియం శ్రీహరి, మోత్కుపల్లి నర్సింహులు, ఆరేపల్లి మోహన్, గడ్డం ప్రసాద్ కుమార్ వంటి పలువురు సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ... సమాజ అభివృద్ధిలో ప్రభుత్వాలదే కీలక పాత్ర అని, అటువంటి ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించకూడదని అన్నారు. ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే భవిష్యత్ తరాలు నష్టపోతాయని తెలిపారు. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన ఎస్సీల కష్టాలు తొలగిపోవాలని ఆయన చెప్పారు. ఎస్సీల అభివృద్ధి కోసం దశలవారీగా కార్యాచరణ అమలుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎస్సీలే పీడిత వర్గాలని ఆయన చెప్పారు. రాష్ట్రంలో వారి సామాజిక, ఆర్థిక బాధలను తొలగించడానికి దశలవారీగా కార్యాచరణ అమలుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. దళిత సాధికారతకు పైరవీలకు ఆస్కారం లేని పారదర్శక విధానాన్ని అమలు చేద్దామని చెప్పారు. ఈ పథకం కోసం నిధులు ఇచ్చే బాధ్యత తనదని అన్నారు. పార్టీలు, రాజకీయాలకు అతీతంగా సమష్టి కార్యాచరణ చేపట్టే బాధ్యతను తీసుకుందామని పిలుపునిచ్చారు.