త‌ప్పుడు ప్ర‌చారం చేసుకుంటున్నారు: రామ్మోహ‌న్ నాయుడు విమ‌ర్శ‌లు

  • ప్ర‌భుత్వం ఇచ్చిన ఒక్క హామీ కూడా నిల‌బెట్టుకోవ‌ట్లేదు
  • ఉద్యోగ క్యాలెండర్ పేరిట యువ‌త‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నారు
  • 6.3 ల‌క్ష‌ల ఉద్యోగాలు ఇచ్చిన‌ట్లు  చెబుతున్నారు
  • వైద్య సిబ్బందికి వేత‌నాలు ఇచ్చే ప‌రిస్థితిలో కూడా ప్ర‌భుత్వం లేదు 
ఇచ్చిన ఒక్క హామీని కూడా వైసీపీ ప్ర‌భుత్వం నిల‌బెట్టుకోవ‌ట్లేదని టీడీపీ నేత రామ్మోహ‌న్ నాయుడు అన్నారు. ఈ రోజు ఆయ‌న మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ... ఉద్యోగ క్యాలెండర్ పేరిట యువ‌త‌ను వైసీపీ నేత‌లు త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నారని ఆరోపించారు. ఒక‌సారి 4.77 ల‌క్ష‌ల ఉద్యోగాలు ఇచ్చిన‌ట్లు ప్ర‌కటించారని ఆయ‌న అన్నారు.  6.3 ల‌క్ష‌ల ఉద్యోగాలు ఇచ్చిన‌ట్లు మ‌రోసారి చెబుతున్నారని విమ‌ర్శించారు.

కరోనా స‌మయంలో తాత్కాలికంగా వైద్య రంగంలో ఉద్యోగాలు ఇస్తున్న‌ట్లు చెప్పారని, అయితే మొద‌టి ద‌శ క‌రోనా విజృంభ‌ణ స‌మ‌యంలో ప‌ని చేసిన వారికి వేతనాలు ఇచ్చే క్ర‌మంలో జాప్యం చేశార‌ని రామ్మోహ‌న్ నాయుడు తెలిపారు. వైద్య సిబ్బందికి వేత‌నాలు ఇచ్చే ప‌రిస్థితిలో కూడా ప్ర‌భుత్వం లేదని ఆయ‌న చెప్పారు. 26 వేల వైద్య సిబ్బందికి ఉద్యోగాలు ఇచ్చిన‌ట్లు ప్ర‌క‌టించుకుంటున్నారని ఆయ‌న అన్నారు. అలాగే, ఆర్టీసీ ఉద్యోగుల‌ను ప్ర‌భుత్వంలో విలీనం చేశారని, కొత్త ఉద్యోగాలు ఇచ్చిన‌ట్లు త‌ప్పుడు ప్ర‌చారం చేసుకుంటున్నారని తెలిపారు.



More Telugu News