కేసీఆర్ నుంచి తెలంగాణకు విముక్తి కల్పిస్తాం: పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి

  • తెలంగాణలోని కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొస్తాం
  • రాహుల్, సోనియా గాంధీ నమ్మకాన్ని నిలబెడతా
  • బీజేపీ, టీఆర్ఎస్ ఒక్కటే
  • పార్టీలో భిన్నాభిప్రాయాలు భేదాభిప్రాయాలు కావు
కేసీఆర్ నుంచి తెలంగాణకు విముక్తి కల్పిస్తామని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) చీఫ్ రేవంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత గత రాత్రి ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడమే తన లక్ష్యమన్నాడు. బడుగు, బలహీన, దళిత, గిరిజన, మైనారిటీ వర్గాల అభ్యున్నతికి, అమరవీరుల కుటుంబాలు, నిరుద్యోగ యువత, రైతుల కోసం రాష్ట్రంలో కాంగ్రెస్‌ను తిరిగి అధికారంలోకి తీసుకొస్తామన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడిగా తనకు అవకాశం కల్పించిన రాహుల్ గాంధీ, సోనియా గాంధీ నమ్మకాన్ని నిలబెడతానని, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ప్రయత్నిస్తానని అన్నారు.

పార్టీలోని సీనియర్లు, పెద్దల సహకారంతో ముందుకు సాగుతానని రేవంత్ పేర్కొన్నారు. పార్టీలోని సీనియర్లు అయిన జానారెడ్డి, హన్మంతరావు వంటి వారిని కలిసి వారి సలహాలు, సూచనలు, ఆలోచనల మేరకు భవిష్యత్ కార్యాచరణ ఉంటుందన్నారు. పార్టీలోని భిన్నాభిప్రాయాలు భేదాభిప్రాయాలు కావని కొట్టిపడేశారు. బీజేపీ, టీఆర్ఎస్ ఒక్కటేనని రేవంత్ విమర్శించారు. ఈటలను బీజేపీలోకి పంపింది కేసీఆరేనని అన్నారు. తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపే కార్యక్రమాలను చేపడతామని రేవంత్ పేర్కొన్నారు.


More Telugu News