నౌకాయానంలో భారత ప్రాచీన వైభవాన్ని మళ్లీ తేవాలి: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
- విశాఖలో వెంకయ్యనాయుడు పర్యటన
- విశాఖ పోర్టు ట్రస్టులో కార్యక్రమం
- నౌకాయానంలో భారత్ ఒకప్పుడు మేటి అని వెల్లడి
- దేశాభివృద్ధిలో నౌకాశ్రయాలది కీలకపాత్ర అని ఉద్ఘాటన
భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విశాఖలో పర్యటిస్తున్నారు. విశాఖ పోర్టు ట్రస్టులో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. నౌకాయానంలో దేశాన్ని అగ్రగామిగా నిలపాలని పిలుపునిచ్చారు. ప్రాచీనకాలంలో భారత్ కు నౌకా రంగంలో ఘనతర కీర్తి ఉండేదని, నాటి వైభవాన్ని మళ్లీ తేవాలని ఆకాంక్షించారు. ఒకప్పుడు చోళులు, కళింగులు మహాసముద్రాలపై తమ ప్రాభవాన్ని చాటారని వివరించారు. దేశ ఆర్థిక వ్యవస్థలో నౌకాశ్రయాలది కీలకపాత్ర అని వెంకయ్యనాయుడు ఉద్ఘాటించారు. విశాఖ పోర్టు ట్రస్టు విస్తరణ ప్రణాళికలను అభినందించారు.
ఈ సందర్భంగా ఆయనతో పోర్టు చైర్మన్ రామ్మోహన్ రావు, ఇతర అధికారులు సమావేశమయ్యారు. 103 ఎకరాల్లో నిర్మించే ఫ్రీ ట్రేడ్ వేర్ హౌసింగ్ జోన్ గురించి పోర్టు చైర్మన్ వెంకయ్యకు వివరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి అవంతి, విశాఖ జిల్లా ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.