మళ్లీ లైన్లో పడిన రొమాంటిక్ లవ్ స్టోరీ '7 డేస్ 6 నైట్స్'

  • ఎమ్మెస్ రాజు నుంచి మరో లవ్ స్టోరీ
  • ఈ సారి కూడా రొమాన్స్ పాళ్లు ఎక్కువే
  • సంగీత దర్శకుడిగా సమర్థ్ పరిచయం
  • సెప్టెంబర్లో సినిమా విడుదల

ఈ తరం ప్రేక్షకుల మనసులను దోచుకున్న ప్రేమకథల్లో ఎమ్మెస్ రాజు సినిమాలు ప్రత్యేకమైన స్థానంలో కనిపిస్తాయి. నిర్మాతగా ఆయన భారీ విజయాలను అందుకున్నారు. కథాకథనాలపై .. పాటలపై ఆయనకి మంచి అవగాహన ఉంది. ఈ మధ్య కాలంలో ఆయన దర్శకుడిగా కూడా మారిన సంగతి తెలిసిందే. దర్శకుడిగా కూడా ఆయన యూత్ మెచ్చే సినిమాలనే తెరకెక్కిస్తున్నారు. కాకపోతే ఈ సారి ఆయన ప్రేమకి కాస్త ఎక్కువ రొమాన్స్ ను జోడించారు. అలా వచ్చిన 'డర్టీ హరి' యూత్ ను కొంతవరకూ ఆకట్టుకోగలిగింది.

తాజాగా ఆయన మరో రొమాంటిక్ స్టోరీని పట్టాలెక్కించారు. సొంత బ్యానర్లో ఆయన ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి '7 డేస్ 6 నైట్స్' అనే టైటిల్ ను ఖరారు చేశారు. చాలావరకూ కొత్తవారినే ఈ సినిమా కోసం తీసుకున్నారు. కొంతవరకూ షూటింగు జరిగిన తరువాత, కరోనా కారణంగా ఆగింది. మళ్లీ ఇప్పుడు ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగు జరుగుతోంది. ఈ సినిమాతో గొల్లపూడి సమర్థ్ సంగీత దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. సెప్టెంబర్లో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు.



More Telugu News