రాష్ట్రంలో ఏం జరుగుతోందో తెలియని కేసీఆర్ కు సీఎంగా ఉండే అర్హతలేదు: ఉత్తమ్ కుమార్
- మరియమ్మ అనే ఎస్సీ మహిళ లాకప్ డెత్
- సీఎం వారం తర్వాత స్పందించారన్న ఉత్తమ్
- కాంగ్రెస్ నేతలు చెబితేనే స్పందించారని ఆరోపణ
- దళితులపై వేధింపులు పెరుగుతున్నాయని వెల్లడి
దళిత మహిళ మరియమ్మ లాకప్ డెత్ అంశంపై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. ఓ ఎస్సీ మహిళ లాకప్ డెత్ దారుణమని పేర్కొన్నారు. లాకప్ డెత్ పై కాంగ్రెస్ నేతలు చెబితే వారం తర్వాత సీఎం కేసీఆర్ స్పందించారని విమర్శించారు. సీఎల్పీ బృందం కలిసినప్పుడు, లాకప్ డెత్ గురించి తనకు తెలియదని సీఎం అన్నారని ఉత్తమ్ వెల్లడించారు. రాష్ట్రంలో ఏం జరుగుతోందో తెలియని కేసీఆర్ కు సీఎంగా ఉండే అర్హత లేదని స్పష్టం చేశారు.
12 శాతం జనాభా ఉన్న మాదిగలకు మంత్రి పదవి లేదని విమర్శించారు. రాష్ట్రంలో దళితులపై వేధింపులు పెరుగుతున్నాయని వెల్లడించారు. తెలంగాణలో ఎక్కువగా మోసపోయింది దళితులేనని అన్నారు. టీఆర్ఎస్, బీజేపీ దళితుల గురించి మాట్లాడుతుండడం హాస్యాస్పదం అని పేర్కొన్నారు.