సునీల్ 'కనబడుటలేదు' టీజర్ విడుదల

  • సునీల్ ప్రధానపాత్రలో డిటెక్టివ్ చిత్రం
  • ఎం.బాలరాజు దర్శకత్వం
  • ఆకట్టుకునేలా ఉన్న టీజర్
  • స్పార్క్ ఓటీటీపై విడుదల కానున్న చిత్రం
సునీల్ ప్రధానపాత్రలో వస్తున్న డిటెక్టివ్ చిత్రం 'కనబడుటలేదు'. తాజాగా ఈ చిత్రబృందం టీజర్ విడుదల చేసింది. పోలీసులకు, డిటెక్టివ్ లకు తేడా ఏంటో సునీల్ చెప్పడం ఈ టీజర్ లో చూడొచ్చు. ఈ చిత్రానికి ఎం.బాలరాజు దర్శకుడు. సతీశ్ రాజు, దిలీప్ కూరపాటి, డాక్టర్ శ్రీనివాస్ కిషన్ ఆనపు, దేవీప్రసాద్ బలివాడ నిర్మాతలు. ఇందులో వైశాలీ రాజ్, సుక్రాంత్ వీరెళ్ల, హిమజ, యుగ్ రామ్, ప్రవీణ్, రవివర్మ, కిరీటి దామరాజు, కంచరపాలెం కిశోర్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. మధు పొన్నాస్ సంగీత స్వరాలకు చంద్రబోస్, మధు నందన్, పూర్ణాచారి సాహిత్యం అందించారు. 'కనబడుటలేదు' చిత్రాన్ని స్పార్క్ ఓటీటీ విడుదల చేయనున్నారు.


More Telugu News