బీహార్ ఉప ముఖ్యమంత్రి ఇంటి ముందు భారీగా వర్షపు నీరు.. వీడియో ఇదిగో
- బీహార్‌లో భారీ వర్షాలు
- రోడ్లపైనే నిలుస్తోన్న నీరు
- తీవ్ర ఇబ్బందులు పడుతోన్న ప్రజలు
వర్షాలు పడ్డాయంటే లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలవడం సాధారణం. పేదలు ఉండే ప్రాంతాల్లో సదుపాయాలు సరిగ్గా ఉండకపోవడంతో వర్షపునీరు అలాగే నిలిచిపోతుంటుంది. అయితే, తాజాగా బీహార్ రాజధాని పాట్నాలో ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి రేణుదేవి నివాస సముదాయం వద్ద నీరు నిలవడం గమనార్హం.
రేణు దేవి ఇంటిముందు ఒకటిన్నర అడుగుల మేర నీరు నిలిచింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఆ ప్రాంతంలో భారీ వర్షం కురవడంతో ఈ పరిస్థితి వచ్చింది. ఉప ముఖ్యమంత్రి ఇంటి వద్దే పరిస్థితి ఇలా ఉందంటే ఇక సాధారణ ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో అర్థం చేసుకోవచ్చని విమర్శలు వస్తున్నాయి.
బీహార్‌లో కురస్తోన్న భారీ వర్షాల ధాటికి పలు ప్రాంతాలలో పెద్ద ఎత్తున ఇళ్లల్లోకి నీరు చేరుతోంది. రోడ్లపైనే నీళ్లు నిలిచిపోతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బీహార్‌లో ఈ రోజు కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ శాస్త్రవేత్తలు తెలిపారు.