సోషల్ మీడియా నుంచి తప్పుకుంటున్నా: కొరటాల శివ
- సంచలన ప్రకటన చేసిన దర్శకుడు కొరటాల
- తప్పుకోవాల్సిన సమయం వచ్చిందని వెల్లడి
- మీడియా ద్వారా టచ్ లో ఉంటానని వివరణ
- అనుబంధం మారదని ఉద్ఘాటన
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ సంచలన ప్రకటన చేశారు. తాను సోషల్ మీడియా నుంచి తప్పుకుంటున్నట్టు వెల్లడించారు. ఇప్పటివరకు వివిధ ఘట్టాలను సోషల్ మీడియా వేదికగా అందరితో పంచుకున్నానని, కానీ ఇప్పుడు తప్పుకోవాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. అయితే, మీడియా మిత్రుల ద్వారా అందరికీ దగ్గరగానే ఉంటానని స్పష్టం చేశారు. మీడియా చానళ్లు, పత్రికల ద్వారా మనం కలుసుకుంటూనే ఉందాం అని పేర్కొన్నారు. మాధ్యమం మారుతుందే తప్ప మన అనుబంధం మారదని కొరటాల శివ వ్యాఖ్యానించారు.
కొరటాల శివ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో 'ఆచార్య' చిత్రం చేస్తున్నారు. కొవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో చిత్రీకరణ నిలిచిపోగా... ఈ చిత్రానికి మిగిలివున్న షూటింగ్ పార్ట్ ను జులైలో శరవేగంతో పూర్తిచేసేందుకు ప్రస్తుతం సన్నాహాలు చేస్తున్నారు.