సీఎం జగన్ కేసుల ఉపసంహరణపై హైకోర్టు ఆదేశాలు
- జగన్ పై గతంలో గుంటూరు, అనంతపురం జిల్లాల్లో కేసులు
- కేసుల ఎత్తివేతకు ప్రభుత్వం సన్నద్ధం
- నివేదిక రూపొందించిన హైకోర్టు పరిపాలన కమిటీ
- నివేదిక ఆధారంగా సుమోటోగా విచారణ
- సీల్డ్ కవర్ లో నివేదిక ఇవ్వాలని ఆదేశాలు
సీఎం జగన్ పై గుంటూరు, అనంతపురం జిల్లాల్లో నమోదైన 11 కేసులను ప్రభుత్వం ఉపసంహరించడం పట్ల జ్యుడిషియల్ అడ్మినిస్ట్రేటివ్ కమిటీ ఓ నివేదిక రూపొందించడం తెలిసిందే. ఈ కమిటీ నివేదిక ఆధారంగా హైకోర్టు సుమోటోగా తీసుకుని నేడు విచారణ చేపట్టింది. అడ్మినిస్ట్రేటివ్ కమిటీ ఇచ్చిన నివేదికను సీల్డ్ కవర్ లో తమ ముందు ఉంచాలని రిజిస్ట్రీని ఆదేశించింది. నివేదికను పరిశీలించిన మీదట ఆదేశాలు వెలువరిస్తామని పేర్కొంది.
కాగా, నిన్న ఇదే అంశంలో, ఏపీ ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ శ్రీరాం వాదనలు వినిపించారు. జ్యుడిషియల్ అధికారాలను హైకోర్టు పరిపాలనా కమిటీ (అడ్మినిస్ట్రేటివ్) అతిక్రమించిందని, దీన్ని హైకోర్టు అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్ మెంట్ సుమోటోగా తీసుకోవడానికి వీల్లేదని వాదించారు. ఇది సీఆర్పీసీకి వ్యతిరేకంగా ఉందని పేర్కొన్నారు. అయితే, హైకోర్టు ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించినట్టు తాజా పరిణామాలతో వెల్లడైంది.