జ‌గ‌న్ రెడ్డి దెబ్బ‌కి రిల‌య‌న్స్ కూడా వెన‌క్కి వెళ్లిపోయింది: నారా లోకేశ్

  • రెండు రోజుల్లో రూ. 17 వేల కోట్ల పెట్టుబడులు తరలిపోయాయి
  • ఉన్న కంపెనీలు పోతున్నాయి.. కొత్త కంపెనీలు రావు
  • ఇలాగైతే యువతకు ఉపాధి ఎలా?
ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ నేత నారా లోకేశ్ మరోసారి విమర్శలు గుప్పించారు. జగన్ రెడ్డి దెబ్బకు రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా వెనక్కి వెళ్లిపోయిందని ఆయన అన్నారు. ట్రైటాన్ జంప్ అయిందని అన్నారు. వైసీపీ ప్రభుత్వ తీరుతో కేవలం రెండు రోజుల్లోనే దాదాపు రూ. 17 వేల కోట్ల పెట్టుబడులు తరలిపోయాయని దుయ్యబట్టారు. టీడీపీ హయాంలో తీసుకొచ్చిన లులూ, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, రిలయన్స్, ట్రైటాన్ లను జగన్ తరిమేశారని చెప్పారు. డూబు క్యాలెండర్లో ఉద్యోగాల్లేవని, కొత్త కంపెనీలురావని, ఉన్నవి వెళ్లిపోతున్నాయని, ఇలాగైతే యువతకు ఉపాధి ఎలాగని ప్రశ్నించారు.

సుప్రీంకోర్టుతో చివాట్లు తినే పరిస్థితిని మరోసారి తెచ్చుకోవద్దని ప్రభుత్వానికి లోకేశ్ సూచించారు. ప్రతిపక్షం అడిగే న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని హితవు పలికారు.


More Telugu News