ఐదుగురి హత్య కేసులో మరణశిక్ష ఎదుర్కొంటున్న సొంతపార్టీ నేతకు శ్రీలంక అధ్యక్షుడి క్షమాభిక్ష

  • సొంతపార్టీలోని ప్రత్యర్థి సహా మరో నలుగురిని హత్య చేసిన సిల్వా
  • 2018లో మరణశిక్ష విధించిన సుప్రీంకోర్టు
  • సిల్వాకు క్షమాభిక్షపై బార్ అసోసియేషన్ ఆగ్రహం
మరణశిక్ష ఎదుర్కొంటున్న సొంత పార్టీ నేత, మాజీ ఎంపీ దుమిందా సిల్వకు శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స క్షమాభిక్ష ప్రసాదించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సుప్రీంకోర్టు దోషిగా తేల్చిన వ్యక్తికి క్షమాభిక్ష ఎలా ప్రసాదిస్తారంటూ శ్రీలంక బార్ అసోసియేషన్ ప్రశ్నించింది.

అధికార పార్టీకి చెందిన దుమిందా సిల్వ 2011లో పార్టీలో తన రాజకీయ ప్రత్యర్థి అయిన భరత లక్ష్మణ్ ప్రేమచంద్రతోపాటు మరో నలుగురిని హత్య చేసిన కేసులో దోషిగా తేలారు. సుప్రీంకోర్టు 2018లో సిల్వాతోపాటు మరో ముగ్గురిని దోషులుగా తేల్చి మరణశిక్ష విధించింది. కాగా, అధ్యక్షుడు రాజపక్స క్షమాభిక్షతో నిన్న విడుదలైన 94 మందిలో సిల్వా కూడా ఉండడంతో అందరూ షాకయ్యారు. అయితే, ఇదే కేసులో మరణశిక్ష పడిన ఇతరులకు మాత్రం క్షమాభిక్ష లభించకపోవడం గమనార్హం.


More Telugu News