ఏపీలో కొత్తగా 4,981 కరోనా కేసులు, 38 మరణాలు
- గత 24 గంటల్లో 88,622 కరోనా పరీక్షలు
- తూర్పుగోదావరి జిల్లాలో 943 కేసులు
- విజయనగరంలో 60 మందికి కరోనా
- చిత్తూరు జిల్లాలో 10 మంది మృతి
- 50 వేల దిగువకు యాక్టివ్ కేసులు
ఏపీలో గత 24 గంటల్లో 88,622 కరోనా పరీక్షలు నిర్వహించగా 4,981 మందికి పాజిటివ్ గా వెల్లడైంది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 943 కొత్త కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో 854, పశ్చిమ గోదావరి జిల్లాలో 593 కేసులు గుర్తించారు. విజయనగరం జిల్లాలో అత్యల్పంగా 60 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
అదే సమయంలో 6,464 మంది కరోనా నుంచి కోలుకోగా, 38 మంది మృత్యువాతపడ్డారు. ఒక్క చిత్తూరు జిల్లాలోనే 10 మంది కన్నుమూశారు. తాజా మరణాలతో కలిపి ఏపీలో ఇప్పటివరకు 12,490 మంది మరణించారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 18,67,017 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 18,04,844 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 49,683 మంది చికిత్స పొందుతున్నారు.