దేశంలో నిన్న 54,069 కరోనా కేసుల నమోదు
- మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,00,82,778
- మృతుల సంఖ్య మొత్తం 3,91,981
- యాక్టివ్ కేసులు 6,27,057
- 39,78,32,667 కరోనా పరీక్షలు
దేశంలో నిన్న 54,069 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దాని ప్రకారం... నిన్న 68,885 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,00,82,778కు చేరింది.
ఇక మరణాల విషయానికొస్తే, నిన్న 1,321 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 3,91,981కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,90,63,740 మంది కోలుకున్నారు. 6,27,057 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. మొత్తం 30,16,26,028 వ్యాక్సిన్ డోసులు వేశారు.
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 39,78,32,667 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 18,59,469 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.