గేట్స్ ఫౌండేషన్ ధర్మకర్తగా తప్పుకున్న వారెన్ బఫెట్
- ఫౌండేషన్ బోర్డులో మూడో వ్యక్తి బఫెట్
- గేట్స్ విడాకులతో సంస్థ మనుగడపై అనుమానాలు
- బఫెట్ తప్పుకోవడంతో మరింత ఆందోళన
- బెర్క్‌షైర్‌లో సగం వాటాలు విరాళం
- పన్ను ఆరోపణలపైనా బఫెట్ వివరణ
ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున దాతృత్వ కార్యక్రమాలు నిర్వహించే బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషన్ ధర్మకర్త(ట్రస్టీ) స్థానం నుంచి ప్రముఖ వ్యాపారవేత్త వారెన్ బఫెట్ తప్పుకున్నారు. ఇప్పటికే బిల్ గేట్స్, మెలిందా ఫ్రెంచ్ గేట్స్ విడాకులతో సంస్థ మనుగడపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో బఫెట్ నిర్ణయం అందరినీ ఆందోళనపరుస్తోంది.
అయితే, తన లక్ష్యాలు 100 శాతం సంస్థ ఆశయాలతో అనుసంధానమై ఉన్నాయని బఫెట్ వ్యాఖ్యానించారు. అలాగే ఆయన బెర్క్‌షైర్ హాత్‌వే షేర్లలో ఇప్పటి వరకు సగం వాటాలను దాతృత్వ కార్యక్రమాలకు ఇచ్చినట్లు ఆయన తరఫున విడుదలైన ప్రకటనలో పేర్కొన్నారు. గత 15 ఏళ్లలో బఫెట్ తన వ్యక్తిగత సంపద నుంచి 27 బిలియన్ డాలర్లు విరాళాలుగా ఇచ్చారు. బిల్, మెలిందాతో పాటు గేట్స్ ఫౌండేషన్‌లో ఈయన మూడో బోర్డు సభ్యుడు. ప్రస్తుతం ఫౌండేషన్ సీఈఓగా ఉన్న సుజ్‌మన్‌కు తన పూర్తి మద్దతు ఉందని బఫెట్ తెలిపారు.
మరోవైపు బఫెట్ గత కొన్నేళ్లలో చెల్లించాల్సిన దానికంటే తక్కువ మొత్తంలో ఆదాయపు పన్ను చెల్లించారని ఇటీవల ఓ నివేదిక పేర్కొన్న విషయం తెలిసిందే. దీనిపై కూడా బఫెట్ స్పందించారు. తాను ఇప్పటి వరకు ఐదు ఫౌండేషన్లకు 41 బిలియన్ డాలర్లు విరాళాలుగా ఇచ్చినట్లు తెలిపారు. అయితే, తన దాతృత్వ కార్యక్రమాల వల్ల ప్రతి 1000 డాలర్లకు కేవలం 40 సెంట్లు మాత్రమే పొదుపు చేసుకోగలిగానని వెల్లడించారు. తనకు తక్కువ ఆదాయం ఉంటుందన్నారు. తన సంపద మొత్తాన్ని పూర్తిగా పన్ను చెల్లించాల్సిన వ్యాపారాల్లోకే మళ్లిస్తానని తెలిపారు.