కేసీఆర్ ఫాంహౌస్ నుంచి బయటకు రావడానికి కారణం ఇదే: డీకే అరుణ

  • పాలమూరు జిల్లా ప్రాజెక్టులపై కేసీఆర్ కు చిత్తశుద్ధి లేదు
  • జగన్ ప్రభుత్వం అక్రమంగా నీటిని తరలించుకుపోతోంది
  • హుజూరాబాద్ ఎన్నికల కోసమే కేసీఆర్ జిల్లాల పర్యటనకు బయల్దేరారు
మహబూబ్ నగర్ జిల్లా నీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి కేసీఆర్ కు చిత్తశుద్ధి లేదని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విమర్శించారు. ఆర్డీఎస్ ప్రాజెక్టుకు సంబంధించి ఏపీ సీఎం జగన్ తో కేసీఆర్ కు చీకటి ఒప్పందం ఉందని ఆరోపించారు. ఆర్డీఎస్ నుంచి జగన్ ప్రభుత్వం అక్రమంగా నీటిని తరలించుకుపోతోందని... అయినప్పటికీ కేసీఆర్ కు సోయి లేదని మండిపడ్డారు.

 తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మహబూబ్ నగర్ జిల్లాకు ఒరిగిందేమీ లేదని అన్నారు. ఆర్డీఎస్ వద్ద కుర్చీ వేసుకుని కూర్చుంటానని చెప్పిన కేసీఆర్ ఎక్కడకు పోయారని ఎద్దేవా చేశారు. కేవలం హుజారాబాద్ ఎన్నికల కోసమే ఫాంహౌస్ నుంచి బయటకు వచ్చి, జిల్లాల పర్యటనకు కేసీఆర్ బయల్దేరారని విమర్శించారు. హుజూరాబాద్ లో గెలవబోయేది బీజేపీనే అని... టీఆర్ఎస్ కు ఘోర ఓటమి ఖాయమని చెప్పారు. 2023 ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు.


More Telugu News