డబ్ల్యూటీసీ ఫైనల్: ఆదిలోనే భారత్‌కు ఎదురుదెబ్బ

  • వర్షం కారణంగా తొలి రోజు, నాలుగో రోజు ఆట రద్దు
  • రిజర్వు డే అయిన నేడు కొనసాగుతున్న ఆట
  • మూడో వికెట్‌గా వెనుదిరిగిన కోహ్లీ
న్యూజిలాండ్‌తో జరుగుతున్న ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ రిజర్వ్ డే అయిన నేడు ప్రారంభమైంది. వర్షం కారణంగా తొలి రోజు, నాలుగో రోజు ఆట రద్దు కావడంతో రిజర్వు డే అయిన నేడు ఆటను కొనసాగిస్తున్నారు. ఓవర్ నైట్ స్కోరు 64/2తో ఆరో రోజు రెండో ఇన్సింగ్స్ కొనసాగించిన భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. 71 పరుగుల వద్ద టీమిండియా సారథి విరాట్ కోహ్లీ అవుటయ్యాడు. 13 పరుగులు చేసిన కోహ్లీ జెమీసన్ బౌలింగులో వాట్లింగ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.

ప్రస్తుతం పుజారా, రహానే క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం భారత జట్టు మూడు వికెట్ల నష్టానికి 71 పరుగులు చేసి న్యూజిలాండ్ కంటే 39 పరుగుల ఆధిక్యంలో ఉంది.


More Telugu News