ఒక్క రూపాయికే ఇయర్ బడ్స్.. స్టాక్ ఉన్నంతవరకు మాత్రమే!
- లావా నుంచి ప్రోబడ్ ఇయర్ పాడ్స్
- మార్కెట్ లో కొత్తగా తెస్తున్న సంస్థ
- రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఆన్ లైన్ లో అమ్మకం
కస్టమర్లకు ఓ బంపర్ ఆఫర్ ఇచ్చింది లావా సంస్థ. ఒక్క రూపాయికే వైర్ లెస్ ఇయర్ బడ్స్ ఇస్తామని ప్రకటించింది. ఫోన్ల మార్కెట్ నుంచి ఇప్పుడు వైర్ లెస్ ఇయర్ బడ్స్ రూట్ లోకి లావా వచ్చింది. అందులో భాగంగా లావా ప్రోబడ్స్ పేరిట తొలి ఇయర్ బడ్స్ ను మార్కెట్ లో లాంచ్ చేస్తోంది.
రేపు (24వ తేదీ) ఆన్ లైన్ లో మధ్యాహ్నం 12 గంటలకు వాటి సేల్ ను మొదలుపెట్టనుంది. అమెజాన్, ఫ్లిప్ కార్ట్, లావా ఆన్ లైన్ స్టోర్ లలో అందుబాటులోకి తెస్తోంది. తొలి ఇయర్ బడ్స్ కావడంతో ‘ఒక్క రూపాయి’ ఆఫర్ పెట్టింది. అయితే, స్టాక్స్ ఉన్నంత వరకు మాత్రమేనన్న షరతు విధించింది. మామూలుగా అయితే దీని ధర రూ.2,199 మరి. అందుకే ఈ ఇయర్ బడ్స్ సేల్ పై ఓ కన్నేసి ఉంచండి. రూపాయికే వాటిని దక్కించుకోండి.
మీడియాటెక్ ఎయిరోహా చిప్ సెట్ టెక్నాలజీతో వస్తున్న ఈ ఇయర్ బడ్స్ లో సమస్యలు చాలా తక్కువగా వస్తాయని కంపెనీ చెబుతోంది. 11.6 ఎంఎం డ్రైవర్ బాస్ వల్ల.. మ్యూజిక్ ను బాగా ఎంజాయ్ చేయొచ్చని పేర్కొంది. అయితే, అవసరం లేని శబ్దాల నివారణ కోసం మాత్రం ప్రత్యేకంగా ఏ వ్యవస్థ లేదు. అయితే, చెవుల్లో పర్ ఫెక్ట్ గా ఇమిడే గుణం వల్ల బయటి శబ్దాలు పెద్దగా డిస్టర్బ్ చేయవని సంస్థ అంటోంది. రెండు పాడ్స్ లు 55 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తాయి. అదే చార్జింగ్ కేస్ అయితే 500 ఎంఏహెచ్ బ్యాటరీతో ఉంటుంది. ఒక్కసారి చార్జ్ చేస్తే 25 గంటల పాటు అవి పనిచేస్తాయని సంస్థ చెబుతోంది.