జెట్ ఎయిర్‌వేస్‌కు త్వరలో మంచి రోజులు!
- జెట్ ఎయిర్‌వేస్ విమానాలు త్వరలో ఎగిరే సూచనలు
- కల్‌రాక్-జలాన్ ప్రతిపాదనలకు ఎన్‌సీఎల్‌టీ ఆమోదం
- స్లాట్ల కేటాయింపునకు డీజీసీఏకు 90 రోజుల గడువు
- పాత రూట్ల కోసం జెట్ ఎయిర్‌వేస్ పట్టు
- సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్న డీజీసీఏ
అప్పుల ఊబిలో చిక్కుకొని 2019లో మూతబడ్డ ప్రముఖ దేశీయ విమానయాన సంస్థ జెట్ ఎయిర్‌వేస్‌కు త్వరలోనే మంచి రోజులు రాబోతున్నాయి. సంస్థ కొనుగోలు నిమిత్తం నిర్వహించిన బిడ్డింగ్‌లో గెలుపొందిన కల్‌రాక్ క్యాపిటల్, మురారి లాల్ జలాన్ కన్సార్షియం సమర్పించిన రుణ పరిష్కార ప్రణాళికకు ‘నేషనల్ కంపెనీస్ లా ట్రిబ్యునల్(ఎన్‌సీఎల్‌టీ) ఆమోదముద్ర వేసింది.
బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, ఉద్యోగులకు జెట్ ఎయిర్‌వేస్ చెల్లించాల్సిన రూ.12,000 కోట్లకు రానున్న ఐదేళ్లలో చెల్లించేందుకు కన్సార్షియం అంగీకారం తెలిపింది. అలాగే డీజీసీఏ నుంచి అనుమతులు లభించిన వెంటనే దాదాపు 30 విమానాలను నడిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని పేర్కొంది.
కాల్‌రాక్-జలాన్ ప్రతిపాదనలకు అంగీకరించిన ఎన్‌సీఎల్‌టీ విమానాశ్రయాల్లో స్లాట్లను కేటాయించేందుకు డీజీసీఏకు 90 రోజుల గడువు ఇచ్చింది. అయితే, రూట్ల అంశం ఇప్పటి వరకు ఓ కొలిక్కి రానట్లు సమాచారం. పాత రూట్లనే కేటాయించాలని కన్సార్షియం కోరుతుండగా.. సాధ్యాసాధ్యాలపై డీజీసీఏ పరిశీలించనుంది.
గతంలో ముంబయి, దిల్లీ వంటి అత్యంత రద్దీ గల విమానాశ్రయాల్లో జెట్ ఎయిర్‌వేస్‌కు 700 టైమ్ స్లాట్లు ఉండేవి. అయితే, సంస్థ కార్యకలాపాలు మూతపడిన తర్వాత వాటిని వేరే సంస్థలకు కేటాయించారు. ఈ నేపథ్యంలో తిరిగి వాటిని పొందేందుకు జెట్ ఎయిర్‌వేస్ ప్రయత్నిస్తోంది.