అత్యాచారం ఘటన ఎంతో కలచివేసింది: సీఎం జగన్

  అత్యాచారం ఘటన ఎంతో కలచివేసింది: సీఎం జగన్
  • ప్రకాశం బ్యారేజి వద్ద అత్యాచారం
  • ప్రియుడ్ని బంధించి నర్సింగ్ విద్యార్థినిపై అఘాయిత్యం
  • ఆవేదన వ్యక్తం చేసిన సీఎం జగన్
  • ఇలాంటి ఘటనలు మరెక్కడా జరగకూడదని వెల్లడి
ఓ నర్సింగ్ విద్యార్థినిపై ప్రకాశం బ్యారేజి సమీపంలో జరిగిన అత్యాచార ఘటన పట్ల సీఎం జగన్ స్పందించారు. ఈ ఘటన తనను ఎంతో కలచి వేసిందని, మనసుకు చాలా బాధ కలిగించిందని, ఇది దురదృష్టకరమని పేర్కొన్నారు. ఇకపై ఇలాంటి వికృత చర్యలు జరగకుండా ఓ అన్నగా, తమ్ముడిగా మరింత శ్రమిస్తానని స్పష్టం చేశారు. ఎన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నప్పటికీ ప్రకాశం బ్యారేజి వద్ద ఘటన జరిగిందని, దీనికి తాము చింతిస్తున్నామని పేర్కొన్నారు. స్త్రీలు అర్ధరాత్రి వేళ కూడా నిబ్బరంగా తిరిగే పరిస్థితి వచ్చినప్పుడే నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్టు అని బలంగా విశ్వసిస్తానని సీఎం జగన్ పేర్కొన్నారు.

మహిళల రక్షణ కోసం దిశ చట్టం కూడా చేశామని, దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశామని వెల్లడించారు. గ్రామ/వార్డు సచివాలయాల్లో మహిళా పోలీసులను నియమించామని, 900 మొబైల్ బృందాలను ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఇక మీదట ప్రకాశం బ్యారేజి తరహా ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు.


More Telugu News