‘కాళేశ్వరం’పై డిస్కవరీ డాక్యుమెంటరీ!

  • 25న రాత్రి 8 గంటలకు ప్రసారం
  • ‘లిఫ్టింగ్ ఎ రివర్’ పేరిట డాక్యుమెంటరీ
  • డాక్యుమెంటరీని నిర్మించిన హైదరాబాద్ వ్యక్తి
కోటి ఎకరాలకు నీళ్లిచ్చే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ప్రాజెక్టు కాళేశ్వరం. అలాంటి ప్రాజెక్టు ప్రాశస్త్యం గురించి చెబుతూ ఈ నెల 25న రాత్రి 8 గంటలకు డిస్కవరీ తన డిస్కవరీ సైన్స్ చానెల్ లో ‘లిఫ్టింగ్ ఎ రివర్’ పేరిట ఓ డాక్యుమెంటరీని ప్రసారం చేయబోతోంది. ఈ డాక్యుమెంటరీని దాదాపు మూడేళ్ల పాటు నిర్మించారు. అందులో ప్రాజెక్టును కట్టిన తీరుతెన్నులను కళ్లకు కట్టినట్టు చూపించారు. 2017లో ప్రారంభించిన ఈ ప్రాజెక్టును కేవలం మూడేళ్లలోనే పూర్తి చేశారు.

కాగా, ఈ డాక్యుమెంటరీని హైదరాబాద్ కు చెందిన కొండపల్లి రాజేంద్ర శ్రీవత్స నిర్మించారు. ఇప్పటికే ఆయన పలు రచనల ద్వారా అనేక అవార్డులను గెలుచుకున్నారు. ఆసియా టెలివిజన్ అవార్డు, సింగపూర్ టెలీ అవార్డ్స్, ఇండియన్ టెలీ అవార్డ్స్, ఇండియన్ టెలివిజన్ అకాడమీ అవార్డులను ఆయన సొంతం చేసుకున్నారు.


More Telugu News